
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విస్తరిస్తోంది. దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకి చేరింది. తాజాగా వెస్ట్ ఢిల్లీకి చెందిన 70...
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విస్తరిస్తోంది. దేశంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకి చేరింది. తాజాగా వెస్ట్ ఢిల్లీకి చెందిన 70 ఏళ్ల మహిళ స్థానిక రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతి చెందిన మహిళ, కుమారుడు గత నెలలో సిట్జర్లాండ్, ఇటలీలో పర్యటించి తిరిగి భారత్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కోవిడ్ 19 పాజిటీవ్ రావటంతో ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే మృతురాలికి షుగర్, బీసీ కూడా ఉండటంతో వైరస్ ను ఆమె శరీరం తట్టుకోలేకపోయింది.. దాంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదివరకే భారతదేశం కరోనా వైరస్ మొదటి మరణాన్ని గురువారం నిర్ధారించింది. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి ఫిబ్రవరి 29 న సౌదీ అరేబియాకు వెళ్లారు. ఒక నెల రోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చి వచ్చాడు. అయితే అతనికి కరోనా సోకడంతో ఐసోలేషన్ లో ఉంచారు. అంతేకాదు ఈ వ్యక్తితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించి నిర్బంధంలో ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు 82 వైరస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలావుంటే దేశంలో రెండో మరణం సంభవించడంతో భారత్ మరింత అపప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, నైట్ క్లబ్స్ ఇలా జన సమూహం చేరే ప్రాంతాలను మూసివేశారు. కర్ణాటకలో వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవద్దని, పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే ఢిల్లీలోను ఇదే తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్ లను నిషేధించింది. కేరళ, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు ప్రకటించాయి. కేరళలో అసెంబ్లీ సమావేశా లను నిరవధికంగా వాయిదా వేశారు. బిహార్‌లో ఆవిర్భావ దినోత్సవాలను రద్దు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



