వణికిస్తున్న కరోనా... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వణికిస్తున్న కరోనా... ఈ జాగ్రత్తలు తప్పనిసరి
x
Highlights

ప్రపంచాన్ని వణికిస్తోంది...కరోనా వైరస్ మహమ్మారి...ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది..వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే...

ప్రపంచాన్ని వణికిస్తోంది...కరోనా వైరస్ మహమ్మారి...ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది..వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య అధికారికంగా 4 వేలు దాటిపోయింది. ...తాజాగా 106 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు ప్రపంచదేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యప్తిచెందుతోంది . ఇప్పటికే అమెరికా, జర్మనీ , శ్రీలంక , కెనడాలోనూ కరోనా కేసులు నమోదైంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారికి కేంద్ర ఆరోగ్యం బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు ..హాస్పిటల్‌లో చేరారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, పాట్నా లోనూ కరోనా వైరస్ అనుమానితులు ఆస్పత్రుల్లో చేరారు.

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ లక్షణాలేంటి ?

ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు తరుచుగా కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది...తలనొప్పి, జ్వరం, దగ్గు , వాంతులు వస్తాయి. ..శరీరంలో ఏదో జరుగుతోందనే భావన, ఆరోగ్యంగా లేమని, అస్వస్తతగా అనిపిస్తుంది. ఛాతిలో నొప్పితో పాటు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఈ వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ ను సంప్రదించాలి.

కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి :

శీతాకాలం కావడంతో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. జంతువుల నుంచి ఈ వైరస్‌ సోకినా...మనుషుల నుంచి మనుషులకు కూడా వేగంగా వ్యప్తి చెందుతోంది. ఈ వైరస్‌కు ఎలాంటి మందు లేదు..వ్యాక్సిన్‌ లేదు..కాబట్టి జాగ్రత్తలు అవసరం. ఈ వ్యాధి వచ్చిన వారు తుమ్మినా , దగ్గినా, పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వారి వస్తువులను ముట్టినా, వారిషేక్‌ హ్యాండ్ చేసినా..వైరస్ సోకుతుంది..

*చేతులను తరచుగా కడుక్కోవాలి

*మాంసాహారాలు , తినకూడదు ముఖ్యంగా చికెన్, మటన్

*బయట కనిపించే వస్తువులను తాకకూడదు

*జలుబు దగ్గు వంటివి వచ్చినప్పుడు డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం

*మంచి ఆహారం తీసుకోవడం మంచిది

*జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలి

*చేతులు, నోరు కడుక్కోకుండా ముక్క, నోరు తాకకూడదు.

*ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోకూడదు

Show Full Article
Print Article
Next Story
More Stories