రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో మోదీ సమావేశం

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో మోదీ సమావేశం
x
PM Modi(File photo)
Highlights

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి , అలాగే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి , అలాగే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.వివిధ రాష్ట్రాల్లోని కోవిడ్ -19 పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడానికి ప్రధాని మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ఇది ఐదవసారి. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది. దేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లాక్డౌన్ మూడవసారి మే 3 నుండి మే 17 వరకు పొడిగించబడింది.

ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసులు 63 వేలకు చేరుకున్నాయి.. ఇందులో దాదాపు 20 వేలమంది కోలుకోగా.. దాదాపు రెండువేల మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా 41,879 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే అత్యధికంగా మహారాష్ట్రలో 20 వేల కేసులు పైగా నమోదయ్యాయి. ఆ తరువాత గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories