రైలు బోగీల్లో మూడు ల‌క్ష‌ల‌ ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణ‌కు ఎన్నంటే

రైలు బోగీల్లో మూడు ల‌క్ష‌ల‌ ఐసోలేషన్ బెడ్స్... తెలంగాణ‌కు ఎన్నంటే
x
Representational Image
Highlights

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధ‌మ‌వుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభించడంతో ఆస్పత్రుల్లోని బెడ్స్ సరిపోని...

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధ‌మ‌వుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభించడంతో ఆస్పత్రుల్లోని బెడ్స్ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ప్ర‌భుత్వం రైళ్ల బోగీల‌నే ఆస్పత్రులుగా వాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇందుకోసం ఇండియ‌న్ రైల్వేకు చెందిన 5 జోన్లు నాన్ ఏసీ ట్రైన్ కోచ్‌ను ఆస్ప‌త్రిగా మార్చింది. ఒక కోచ్‌లో 16 మంది రోగుల‌కు చికిత్స అందించేలా చ‌ర్య‌లు తీసుకుంది.

దీంతో మ‌రిన్ని రైల్వే కోచ్‌లను వార్దుల‌ మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 20,000 కోచ్‌లను మాడిఫై చేసి 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌ని మర్చేసింది. దీంతో తెలంగాణకు అత్య‌ధిక కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాటికి క్వారంటైన్, ఐసోలెష‌న్ వార్డులుగా ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఐసోలేషన్ వార్డులుగా భారతదేశంలో 16 రైల్వే జోన్లల్లో కోచ్ ల‌ను ఎక్క‌డేక్క‌డ‌ మార్చనున్నామో రైల్వే వివరించింది. సికింద్రాబాద్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న సౌత్ సెంట్ర‌ల్ రైల్వే పరిధిలో 486 కోచ్‌లు అంటే 7,776 ఐసోలేషన్ వార్డులు, ముంబై హెడ్‌క్వార్టర్‌గా 482 కోచ్‌లు 7712 ఐసోలేషన్ వార్డులు అందుబాటులోకి తేనుంది. మొత్తం 20,000 కోచ్‌లను టార్గెట్‌ పెట్టుకోగా... ఇప్పటికే 5,000 కోచ్‌లను ఐసోలేషన్ బెడ్స్ గా మార్చే పని మొదలైంది. ఏసీ కోచ్‌లో 9 కంపార్ట్‌మెంట్స్, 4 టాయిలెట్స్, బాత్‌రూమ్స్‌గా మార్చారు. ప్రతీ క్యాబిన్‌లో 6 బెర్తులతో 10 క్యాబిన్స్ ఉంటాయి.

ఇక పేషెంట్లకు, వైద్య సిబ్బందికి వేర్వేరు క్యాబిన్స్ ఉండ‌నున్నాయి. ఒక కంపార్ట్‌మెంట్‌ను వైద్య సిబ్బంది కోసం న‌ర్సింగ్ కోచ్ గా మారుస్తుంది. ప్రతీ కంపార్ట్‌మెంట్‌కో 220 వోల్డ్ ఎలక్ట్ పాయింట్ ఉంటుంది. క్యాబిన్ రెడీ చేసేందుకు మూడు బెర్తులు తొల‌గించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories