మోదీతో సమావేశం : లాక్‌డౌన్‌కే రాష్ట్రాల మొగ్గు

మోదీతో సమావేశం : లాక్‌డౌన్‌కే రాష్ట్రాల మొగ్గు
x
Narendra Modi
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14 తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14 తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా రెండు గంటలపాటు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రాల వారీగా అభిప్రాయాలు తెలుసుకున్నారు ప్రధాని. అందరి ముఖ్యమంత్రుల సూచనలను, సలహాలు స్వీకరించారు.. అయితే అందరూ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను కొనసాగించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ముఖ్యమంత్రులు.. ప్రధానితో ఇదే విషయాన్నీ స్పష్టం చేశారు. మరోవైపు ప్రజల ఆరోగ్య పరిస్థితులు.. అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, కిట్లు, మందులు, వైద్య సిబ్బంది, ఆహార పదార్ధాల సేకరణ వంటి కీలక అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సీఎంలకు సూచనలు చేశారు.

ఇదిలావుంటే భారత్ లో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగాయి.. దీంతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 7 వేల 785 కు పెరిగింది. నేడు మహారాష్ట్రలో 92, గుజరాత్‌లో 54, రాజస్థాన్‌లో 18, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లో 3–3 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలు covid19india.org వెబ్‌సైట్, రాష్ట్ర ప్రభుత్వాల డేటా ప్రకారం ఉన్నాయి. అదే సమయంలో, దేశంలో 7 వేల 447 మందికి కోవిడ్ వ్యాధి సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 6 వేల 565 మంది చికిత్స పొందుతున్నారు. 643 మందికి నయమైంది.. ఇక 239 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories