శివ భక్తులకు షాకింగ్ న్యూస్.. ఈ ఏడాది ఆ టూర్ రద్దు

శివ భక్తులకు షాకింగ్ న్యూస్.. ఈ ఏడాది ఆ టూర్ రద్దు
x
Amarnath (File Photo)
Highlights

కరోనా ఉద్ధృతి కారణంతో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర రద్దు చేస్తూ.. శ్రీ అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు (SASB) నిర్ణయం తీసుకుంది.

కరోనా ఉద్ధృతి కారణంతో ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర రద్దు చేస్తూ.. శ్రీ అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు (SASB) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకు అమర్‌నాథ్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో దాన్ని రద్దు చేశారు. అయితే ఈ మేరకు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ఛైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన 38వ బోర్డు సమావేశం జరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో అమర్‌నాథ్ యాత్ర నిర్వహణపై బోర్డు సభ్యులు చర్చలు జరిపారు. కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర సాగే మార్గాల్లో 77 కరోనా రెడ్ జోన్లు ఉన్నాయని భక్తులను యాత్రకు అనుమతి ఇస్తే కరోనా వైరస్ బారినపడే ప్రమాదముందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో మంచు తొలగించడం,క్యాంపుల నిర్వహణ, భక్తులకు వైద్య సదుపాయాలు వంటివి కల్పించలేమనీ అభిప్రాపడ్డారు.

ఈ నేపథ్యంలోనే యాత్రను ఈ ఏడాది రద్దుచేస్తున్నట్లు ఏకగ్రీవంగా బోర్డు తీర్మానం చేసింది. పరమశివుడు భక్తుల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ గరీష్ చంద్ర ముర్ము తెలిపారు. అయితే అమర్‌నాథ్ పూజలు అగవని, గుహలోనీ జ్యోతిర్లింగానికి పూజ, సంపన్న్ పూజ మాత్రం సంప్రదాయబద్ధంగా కొనసాగుతాయి అని తెలిపారు. మంచులింగ దర్శనాన్ని శివ భక్తుల కోసం ఆన్‌లైన్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించడంపై SASB పరిశీలిస్తోందని గిరీష్ చంద్ర తెలిపారు. 2019లో ఆర్టికల్ 370 బిల్లు నేపథ్యంలో కేంద్రం అమర్‌నాథ్ యాత్రను మధ్యలోనే నిలిపివేసింది . ఈ సారి కరోనా కారణంగా ఆమర్‌నాథ్ యాత్ర రద్దయింది. కాగా, జమ్మూకాశ్మీర్‌లో 407 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు మరణించగా.. 92 మంది లద్దాఖ్‌లో ఇప్పటి వరకు 18 మంది కరోనా బారినపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories