Coronavirus: ఇండియాలో 5 రోజుల్లో 7 వేలకు పైగా కేసులు

Coronavirus: ఇండియాలో 5 రోజుల్లో 7 వేలకు పైగా కేసులు
x
Highlights

కరోనా సంక్రమణ కారణంగా దేశంలో మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం 43 మంది సోకినవారు మరణించారు.

కరోనా వైరస్ సంక్రమణ కారణంగా దేశంలో మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం 43 మంది సోకినవారు మరణించారు. దాంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 730 కి చేరుకుంది. గురువారం మహారాష్ట్రలో గరిష్టంగా 14, గుజరాత్‌లో 9 మరణాలు సంభవించాయి. మధ్యప్రదేశ్‌లో 6 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లో ముగ్గురు మృతి చెందారు. రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడులలో ఇద్దరేసి మరణించారు. కర్ణాటక, తెలంగాణ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు తుది శ్వాస విడిచారు.

ఇదిలావుంటే గత 5 రోజుల్లో, దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 7 వేలకు పైగా పెరిగింది. గురువారం 1667 కేసులు నమోదయ్యాయి. ఇది ఒకరోజులో అత్యధిక సంఖ్య. అంతకుముందు, ఏప్రిల్ 19 న, గరిష్టంగా 1580 మంది సోకినట్లు గుర్తించారు. ఇక ఏప్రిల్ 18 న దేశంలో 15724 మంది రోగులు ఉంటే.. అప్పటి నుండి గురువారం వరకు 7,315 మంది రోగులు పెరిగారు. అంటే, 5 రోజుల పెరుగుదల 46.52% ఉందన్నమాట.. ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం 21,700 కరోనా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16,689 మంది చికిత్స పొందుతున్నారు. 4324 మందికి నయం కాగా, 686 మంది మరణించినట్టుగా పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories