లాక్‌డౌన్‌ సడలింపులు లేవు.. సీఎం నిర్ణయం

లాక్‌డౌన్‌ సడలింపులు లేవు.. సీఎం నిర్ణయం
x
Representational Image
Highlights

ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను మార్చుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను మార్చుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ సడలిపులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఢిల్లీలో లాక్డౌన్ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 27 న నిపుణుల సమీక్ష సమావేశం జరుగుందని.. ఈలోపు సడలింపులను అనుమతించబోమని ముఖ్యమంత్రి ఆదివారం ప్రకటించారు.

ఢిల్లీలో 11 జిల్లాలు ఉన్నాయన్న ఆయన అవన్నీ హాట్‌స్పాట్‌లుగా ప్రకటించబడ్డాయని.. కేంద్ర ప్రభుత్వం ప్రకారం, కంటైనర్ జోన్లలో ఆంక్షలను సడలించలేము అని అన్నారు. ఢిల్లీ ప్రజల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 27 న మేము మళ్ళీ అన్ని నిపుణులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించి.. అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 1,893 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories