ఇవాళ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించండి ఇలా..

ఇవాళ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించండి ఇలా..
x
Representational Image
Highlights

క‌రోనా మహమ్మారిని పారదొలేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు పోరాడుతున్నాయి. మన దేశంలోనూ లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా పాటించేలా ప్రయత్నిస్తున్నారు.

క‌రోనా మహమ్మారిని పారదొలేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు పోరాడుతున్నాయి. మన దేశంలోనూ లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా పాటించేలా ప్రయత్నిస్తున్నారు. భార‌త ప్రధాని మోదీ ఇదే సమయంలో జాతిలో ఐక్యత తీసుకొచ్చేందుకు ప‌లు కార్యక్రమాలను చేపడుతున్నారు. దానిలో భాగంగా వైద్యుల సేవలను గుర్తించి చప్పట్లు కొట్టి వైద్యుల‌కు ధన్యవాదాలు తెల‌ప‌డం వంటివి చేపట్టారు. తాజాగా ఈ నెల ఐదున క‌రోనాపై పోరుకు స్ఫూర్తినిస్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి ఇంటిలో దీపాలు విలిగించాల‌ని పిలుపునిచ్చారు.

అందరూ తప్పనిసరిగా కుల, మత భేదం లేకుండా తొమ్మిది గంట‌ల స‌మ‌యంలో జ్యోతి ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ కోరారు. దీపం వెలిగించే అంశంపై చాలామంది వివాదస్పదం చేస్తున్నారు. ప‌లువురు ఆద్యాత్మిక వేత్త‌లు దీనిని పురాతన కాలం నుంచే జ్యోతి ప్రజల్వన ఉంద‌ని, అందుకు ఏ కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టిన‌ ముందుగా జ్యోతిప్రజ్వలన చేస్తుంటారు. మ‌నిషి మ‌ర‌ణించిన త‌ర్వాత దీపం తల దగ్గర పెడుతుంటారు. దీని వెనుక అర్థం కాంతికి ఏ వస్తువులోకైనా ప్రవేశించే మహాశక్తి ఉంటుంద‌ని ప‌లువురు ఆధ్యాత్మికవేత్త‌లు అంటున్నారు. మ‌రి కొందరు హేతువాదులు దీన్ని త‌ప్పుబ‌డుతున్నారు. కరోనా వైరస్ చనిపోతుందనే దృక్పథం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

విద్యుత్ దీపాలు అపేముందు ఇవి పాటించండి:

ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు ఆన్ లోనే ఉంచాల‌ని.

♦ కేవ‌లం ఇళ్ల‌లో లైట్స్ మాత్ర‌మే ఆపాలి.

♦ కొవ్వ‌త్తి, లాంథ‌రు, దీపం, టార్చ్ లైట్స్, ఫ్లాష్ లైట్స్ వెలిగించాలి.

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇవాళ రాత్రి 9.09 గంటలకు ఆపాలని విద్యుత్తు శాఖాధికారులు ప్రకటించారు. అయితే దేశంలో ఒకేసారి అందరూ విద్యుత్ దీపాలు ఆపేస్తే విద్యుత్తు గ్రిడ్‌పై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర విద్యుత్తు శాఖ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు ఇళ్ల‌లో క‌రెంట్ వెలిగే లైట్లు ఆపాల‌ని 'ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌ వంటి వాటిని ఆపకూడదని విద్యుత్ శాఖ సూచించింది. అపార్టుమెంట్లు, పెద్ద భ‌వ‌నాల‌కు, కాలనీలకు కరెంటు సరఫరా చేసే వ్యవస్థలైన ట్రాన్స్‌ఫార్మర్లుకు విద్యుత్ సరఫరా కొనసాగించాలి. వీధి దీపాలు కూడా వెలగనివ్వాలి అని అధికారులు సూచించారు.

దేశంలో అంద‌రూ విద్యుత్ అపివేస్తే గరిష్ఠంగా 12897 మెగావాట్ల లోడు తగ్గుతుందని అంచనా వేసింది. ఈ నేప‌థ్యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా కేంద్రాల‌లో ఉత్పత్తిని రాత్రి 9 గంటలకు ముందు తగ్గించి మళ్లీ 9.09 గంటలకు ప్రారంభించాలని సూచించింది. తెలంగాణలోని నాగార్జునసాగర్‌, ఏపీలోని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో విద్యుత్ ఉత్ప‌త్తికి అవకాశముంది.

ప్ర‌ధాని పిలుపుకు ప్ర‌ముఖులంతా స్పందిస్తున్నారు. ఇవాళ‌ తొమ్మిది గంటలకు ప్రతి ఇంటిలో ప్రజలు 9 నిమిషాల సేపు విద్యుత్తు లైట్లు ఆపివేసి, దీపాలు వెలిగించాలని తెలంగాణ‌ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories