దేశంలో 300 దాటిన కరోనా మరణాలు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ

దేశంలో 300 దాటిన కరోనా మరణాలు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ
x
Representational Image
Highlights

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఆదివారం 24 గంటల్లో 35 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 308కి చేరింది. అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య 9,152కి చేరింది. వీరిలో 857 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 7987 మంది ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల తెలిసింది.

దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతి తీవ్రంగా పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,985 అయ్యింది. మృతుల సంఖ్య 149కి చేరింది. రోజూ మహారాష్ట్రలో 200 దాకా కొత్త కేసులు వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మరణాలు పెరుగుతున్నాయి. తెలంగాణలో అవి 16కి చేరగా... ఏపీలో అవి ఏడుకు ఉన్నాయి. ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్‌లో కూడా కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నయి.

అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చూస్తే :

ఢిల్లీ 1154,

♦ మహారాష్ట్ర 1985,

♦ తమిళనాడు 1043,

♦ త్రిపుర 2

♦ మిజోరం 1,

♦ అరుణాచల్ ప్రదేశ్ 1,

♦ రాజస్థాన్ 804,

♦ మధ్యప్రదేశ్ 564,

♦ తెలంగాణ 504,

♦ ఉత్తరప్రదేశ్ 483,

♦ ఆంధ్రప్రదేశ్ 427,

♦ గుజరాత్ 516,

♦ కేరళ 376,

♦ జమ్మూకాశ్మీర్ 245, హర్యానా 185, బెంగాల్ 152, పంజాబ్ 151, బీహార్ 64, ఒడిశా 54, ఉత్తరాఖండ్ 35, హిమాచల్ ప్రదేశ్ 32, చత్తీస్‌గఢ్ 31, అసోం 29, చండీగర్ 21, లఢక్ 15, అండమాన్ నికోబార్ 11, గోవా 7, పుదుచ్చేరి 7, మణిపూర్ 2 పాజిటివ్ కేసులు నమోదుఅయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories