దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే

దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే
x
Representational Image
Highlights

దేశంలో కరోనా వైరస్ ఉధృతి అంత‌కంత‌కు పెరుగుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య మంగళవారం ఉదయానికి 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్ ఉధృతి అంత‌కంత‌కు పెరుగుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య మంగళవారం ఉదయానికి 4421కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాణాంత‌క వైర‌స్ బారిన ప‌డి 114మంది మరణించగా.. 3981 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపింది. మరో 326 మంది క‌రోనా మ‌హ‌మ్మ‌రి నుంచి కోలుకున్నారు.

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా పెరుగుతున్నాయి. 24గంటల్లోనే 354 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వచ్చే వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్నాయి. ఇప్పటివరకు మ‌హ‌రాష్ట్ర‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 748కి చేరింది. కరోనాతో 45మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 144గా.. మృతుల సంఖ్య 12కు చేరింది. జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు , యూపీలో 305కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. హరియాణా, బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం ప్ర‌క‌టించింది.

ఇక మధ్యప్రదేశ్‌లో వైరస్ విల‌య‌తాడ‌వం చేస్తుంది. 165పాజిటివ్‌ కేసులు ఉండగా.. 9మంది మర‌ణించి న‌ట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాజాగా.. ఇండోర్‌లో మరో 4 మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో కొవిడ్ మ‌ర‌ణాలు 13కు చేరిందని ఎంజీఎం మెడికల్‌ కాలేజీ వెల్ల‌డించింది. ఇంకా కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించలేదు. ఢిల్లీ కోవిడ్ పంజా విసురుతోంది. కరోనా కారణంగా ఏడుగురు మ‌ర‌ణిచంగా... బాధితుల సంఖ్య 523కు చేరింది. పంజాబ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 76కేసులు నమోదుకాగాజ.. ఆరుగురు ప్రాణాలు విడిచారు. పశ్చిమబెంగాల్‌లో కరోనా బారినపడి ముగ్గురు మరణించారు.

ద‌క్షిణ‌భార‌తదేశంలో కూడా క‌రోనా మ‌హ‌మ్మ‌రి విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తుంది. తమిళనాడ లో 621మందికి క‌రోనా సోకింది. ఐదుగురు మరణించారు. దేశంలో మహారాష్ట్ర తరువాత తమిళనాడులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో నలుగురు మరణించారు.కేరళలో కేసుల సంఖ్య 327కు చేరగా.. ఇద్దరు మృతి చెందారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. తెలంగాణలో కొత్తగా మ‌రో 30 కరోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 364కి చేరింది. 304మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 11మంది మ‌ర‌ణించిన‌ట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైర‌స్ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. సోమ‌వారం భారీ సంఖ్య‌లో కేసులు న‌మోదయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74మందికి కరోనా సోకింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసులు 304కి చేరింది. ముగ్గురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా క‌రోనా కేసులు పెగిపోయాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories