దేశంలో పదివేలు దాటిన కరోనా కేసులు..

దేశంలో పదివేలు దాటిన కరోనా  కేసులు..
x
Representational Image
Highlights

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1211 కొత్త కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1211 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 31 మరణాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10363కి చేరింది. అలాగే 339 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా నుంచి 1035 మంది కోలు కున్నారు. కరోనాతో బాధపడుతూ 8,988 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తొలిసారిగా మూడు రాష్ట్రాలు వెయ్యి కేసుల మార్కును దాటాయి. మహారాష్ట్ర ఏకంగా రెండు వేల మార్కును దాటేసింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య చూస్తే..

మహారాష్ట్ర 2334,

♦ ఢిల్లీ 1510,

♦ తమిళనాడు 1173,

♦ రాజస్థాన్ 873,

♦ మధ్యప్రదేశ్ 604,

♦ తెలంగాణ 562,

♦ ఆంధ్రప్రదేశ్ 432,

♦ గుజరాత్ 539,

♦ ఉత్తరప్రదేశ్ 558,

♦ కేరళ 379,

♦ జమ్మూకాశ్మీర్ 270,

♦ బెంగాల్ 190,

♦ హర్యానా 185,

♦ పంజాబ్ 167,

♦ బీహార్ 65,

♦ ఒడిశా 54,

♦ ఉత్తరాఖండ్ 35,

♦ హిమాచల్ ప్రదేశ్ 32,

♦ అసోం 31,

♦ చత్తీస్‌గఢ్ 31,

♦ చండీగర్ 21,

♦ లఢక్ 15,

♦ అండమాన్ నికోబార్ 11,

♦ గోవా 7, పుదుచ్చేరి 7, మణిపూర్ 2, త్రిపుర 2, మిజోరం 1, అరుణాచల్ ప్రదేశ్ 1 కేసు నమోదయ్యాయి.

REJOINDER

ఈ ఆర్టికల్ కు తొలుత ఉపయోగించిన ఇమేజిలో పొరపాటు దొర్లినది. ఇమేజి సెలక్ట్ చేసుకోవడంలో జరిగిన పొరపాటు ఇది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాము. ఆ ఆర్టికల్ నుంచి ఆ ఇమేజిలు తొలగించడం జరిగింది. ఇటువంటి పొరపాట్లు మరోసారి దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అందరికీ తెలియచేసుకుంటున్నాము.


Show Full Article
Print Article
Next Story
More Stories