వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసుల వివరాలు

X
Highlights
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
Raj23 May 2020 6:18 AM GMT
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా 6570 మందికి కరోనా సోకింది. దాంతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 1 లక్ష 25 వేల 120 కు పెరిగింది. మహారాష్ట్రలో ఒకే రోజు అత్యధికంగా 2940 పాజిటివ్ కేసులు వచ్చాయి. కేరళలో కొత్తగా సోకిన వారిలో 17 మంది విదేశాల నుండి, 21 మంది మహారాష్ట్ర నుండి తిరిగి వచ్చారు.
ఢిల్లీలో 660, తమిళనాడులో 786, గుజరాత్‌లో 363, మధ్యప్రదేశ్‌లో 189, ఉత్తర ప్రదేశ్‌లో 220, రాజస్థాన్‌లో 267, కర్ణాటకలో 138, బీహార్‌లో 179, ఒడిశాలో 86 మంది రోగులు పాజిటివ్ గా తేలారు. వీరితో పాటు, ఇంకా 217 మంది రోగులు ఉన్నారు. కాగా ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ఆధారంగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో 1 లక్ష 25 వేల 447 మందికి కరోనా సోకింది.
Web TitleCoronavirus latest updates and Positive cases in India
Next Story