coronavirus : సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం.. ముగ్గురు అరెస్ట్

coronavirus : సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం.. ముగ్గురు అరెస్ట్
x
Highlights

కేరళలో వైద్య విద్యార్థినికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆమెను పరీక్షించిన అనంతరం త్రిశూర్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు....

కేరళలో వైద్య విద్యార్థినికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆమెను పరీక్షించిన అనంతరం త్రిశూర్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా వైద్య విద్యార్థిని ఆరోగ్య స్థితి మెరుగుపడిందని తెలిసింది. ఆ మహిళ వుహాన్ విశ్వవిద్యాలయ విద్యార్థిని, త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. కరోనావైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆరోగ్య స్థితి సంతృప్తికరంగా ఉంది. అంతేకాదు ఆసుపత్రులలో ఒంటరిగా ఉన్న రోగలక్షణ వ్యక్తులందరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి అధికారులు నిర్ధారించారని బులెటిన్ తెలిపింది. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వైరస్ ప్రభావం రాష్ట్రంలో లేదని ప్రభుత్వాధికారులు చెబుతున్నప్పటికీ దీని గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వైరల్ గా మారింది.

ఈ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసినందుకు కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన తరువాత ఈ అంటువ్యాధికి వ్యతిరేకంగా కేరళ నిఘా, నియంత్రణ చర్యలను బలోపేతం చేసిందని ఆరోగ్య మంత్రి కె.కె.శైలజా తెలిపారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి చేరుకున్న మరియు తమ పర్యవేక్షణలో ఉన్న వారి గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆమె విలేకరులతో అన్నారు. మరో ఆరుగురు పోస్టులను ఫార్వార్డ్ చేశారని, సైబర్ సెల్ ఈ విషయాన్ని పరిశీలిస్తోందని శైలజా తెలిపారు. ఈ వ్యాధిపై తప్పుడు వార్తలు పెట్టిన వారిపై బలమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంతకు ముందు హెచ్చరించారు. అరెస్టైన వ్యక్తులు సబారీ షఫీ, సిరాజ్‌ లు అని పోలీసులు వెల్లడించారు. అయితే సబారీ ఇప్పటికే బెయిల్ పై విడుదల అయినట్టు పోలీసులు తెలిపారు.

దీనికి సంబంధించి త్రిశూర్‌లోని రెండు పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. అలాగే కరోనావైరస్ ప్రభావిత దేశాల నుండి ప్రయాణించిన 1793 మందిని గుర్తించి నిఘాలో ఉంచినట్లు వైద్యుల బులెటిన్ లో పేర్కొన్నారు. వారిలో 70 మందిని ఐసోలేషన్ ఉన్నారని.. 1,723 మంది నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు 39 నమూనాలను పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) కు పంపించామని, అందులో 23 నమూనాలు ప్రతికూలంగా ఉన్నాయని బులిటెన్ తెలిపింది. కాగా రాష్ట్రంలో 24x7 కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు ఆస్పత్రులను ఇందుకోసం ఏర్పాటు చేసి సదుపాయాలు సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories