Coronavirus: పోలీసు వలయం నుంచి తప్పించుకున్న కరోనా పాజిటివ్ రోగి..

Coronavirus: పోలీసు వలయం నుంచి తప్పించుకున్న కరోనా పాజిటివ్ రోగి..
x
Highlights

కరోనా పాజిటివ్ ఖైదీ ఆదివారం సాయంత్రం జబల్పూర్ లోని మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డ్ నుండి పారిపోయాడు, దీంతో ఆసుపత్రి అధికారులు, స్థానిక పోలీసులను వణికిస్తున్నాడు.

కరోనా పాజిటివ్ ఖైదీ ఆదివారం సాయంత్రం జబల్పూర్ లోని మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డ్ నుండి పారిపోయాడు, దీంతో ఆసుపత్రి అధికారులు, స్థానిక పోలీసులను వణికిస్తున్నాడు. ఇండోర్‌కు చెందిన జావేద్ ఖాన్ కు వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో నమూనాలను తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఆన్-డ్యూటీ పోలీసులు , ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేశాడు. దాంతో అతనిపై కేసు నమోదు చేసి జబల్‌పూర్‌ జైల్లో ఉన్న ఐసోలేషన్ వార్డుకు పంపారు. అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే ఆదివారం సాయంత్రం, ఖైదీని ఐసోలేషన్ వార్డ్ నుండి జబల్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన సూపర్ స్పెషాలిటీ వార్డుకు తరలించారు.. ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ వ్యక్తి అందరి కళ్లుగప్పి పారిపోయాడు. అతను పోలీసుల వలయంలో ఉన్నా వైరస్ లక్షణాలు ఉండటంతో పోలీసులు అతనికి కొంత దూరంగా ఉన్నారు. దాంతో ఒక్కసారిగా లంకించుకున్నాడు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు మెడికల్ కాలేజీకి చేరుకున్నారు.. ఖాన్ తప్పించుకున్న విషయంపై జిల్లాలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారం అందించారు. పారిపోయిన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడ్డారు.

పారిపోయిన వ్యక్తి యొక్క చిత్రాన్ని విడుదల చేసిన జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీసు (ఎస్పీ) అమిత్ సింగ్ .. నగరంలో ఎక్కడైనా అతన్ని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులను కోరారు. అలాగే అతని గురించి సమాచారం ఇస్తే 10,000 రూపాయల రివార్డును కూడా ఎస్పీ ప్రకటించారు. ఇక ఈ సంఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. దర్యాప్తును సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌కు అప్పగించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories