దేశంలో కంట్రోల్ అవుతున్న కరోనా .. ఆ రాష్ట్రాల్లో తగ్గుముఖం

దేశంలో కంట్రోల్ అవుతున్న కరోనా .. ఆ రాష్ట్రాల్లో తగ్గుముఖం
x
Representational Image
Highlights

భారత్ లో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 17656కి చేరింది. వాటిలో 2842 కేసుల్లో రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు.

భారత్ లో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 17656కి చేరింది. వాటిలో 2842 కేసుల్లో రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 559గా ఉంది. అయితే కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. విదేశాలతో పోల్చితే ఇండియాలోనే కరోనా కంట్రోల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కేంద్రం తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు అవుతుంది కొన్ని చోట్ల మాత్రమే. మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ అవుతోంది.

దేశంలోని 736 జిల్లాల్లో ఏప్రిల్‌ 19 నాటికి 325 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. ఇక ఏప్రిల్‌ 4 నుంచి విదేశీయులు ఎక్కువగా వచ్చే గోవాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దేశంలోని కరోనా నుంచి బయటపడిన తొలి రాష్ట్రంగా గోవా గుర్తింపు తెచ్చుకుంది. గోవా ప్రభుత్వ కఠిన చర్యల వల్ల 7 కేసులే నమోదయ్యాయి. అందరూ కరోనాను జయించి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్‌ లో ఇప్పుడు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేదు.

సిక్కింలో ఇంతవరకూ ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. కేరళ ఊపిరి పీల్చుకుంటోంది. 402 మందికి వైరస్ సోకగా 270 మంది కోలుకున్నారు. ముగ్గురు మాత్రమే మరణించారు. మహారాష్ట్రలో ముంబై, తెలంగాణలో హైదరాబాద్, మధ్యప్రదేశ్‌లో ఇండోర్ లాంటి నగరాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు కరోనా నియంత్రణ పై గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఇలానే సాగితే జూన్ లోగా కరోనా కట్టడి అయ్యే అవకాశం ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories