Coronavirus: ఢిల్లీలో విశ్వరూపం చూపుతోన్న కరోనా వైరస్

Coronavirus Effect in Delhi
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: విపరీతంగా పెరుగుతున్నపాజిటివ్ కేసులు * కరోనా రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

Coronavirus: ఢిల్లీలో కరోనా విశ్వరూపం చూపుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఢిల్లీలో అత్యంత ప్రాచుర్యం పొందిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయన్‌ ఆసుపత్రిలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయింది. ఇద్దరు కరోనా రోగులను ఒకే బెడ్డుపై ఉంచుతూ చికిత్స పొందుతున్నారు డాక్టర్లు. హాస్పిటల్‌లో బెడ్లు పూర్తిగా నిండిపోవడంతో చేసేది లేక ఒకేసారి ఇద్దరు పేషెంట్లను పక్కపక్కనే ఉంచుతూ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories