Coronavirus: ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఒక్కరోజులోనే..

Coronavirus: ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం.. ఒక్కరోజులోనే..
x
coronavirus in Italy
Highlights

ఇటలీలో కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో తాజాగా 627 మంది మరణించారు.

ఇటలీలో కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో తాజాగా 627 మంది మరణించారు.. దాంతో మొత్తంగా మరణించిన వారి సంఖ్య 4,032 కు చేరిందని ఇటలీ అధికారులు శుక్రవారం తెలిపారు, ఒక నెల క్రితం ఈ మహమ్మారి ఇటలీలోకి ప్రవేశించిన తరువాత తాజా గణాంకాల ప్రకారం 18.4% మరణాల సంఖ్య పెరిగింది. కరోనా వైరస్ కు నిలయమైన చైనాలో మరణించిన సంఖ్యను గురువారం ఇటలీ అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలను ఇటలీ నమోదు చేసింది.

శుక్రవారం వరకు, ఇటలీ ఒక్క రోజులో 475 కన్నా ఎక్కువ మరణాలను నమోదు చేయలేదు, అంటువ్యాధి ప్రభావం బాగా మందగించిన చైనా, 150 కన్నా ఎక్కువ నివేదించలేదు. అలాగే ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 41,035 నుంచి 47,021 కు పెరిగిందని, ఇది 14.6% పెరిగిందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. 2,549 మరణాలు మరియు 22,264 కేసులతో లోంబార్డి ఉత్తర ప్రాంతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ దేశవ్యాప్తంగా మొదట సోకిన వారిలో, 5,129 మంది శుక్రవారం పూర్తిగా కోలుకున్నారు, అంతకు ముందు రోజు ఈ సంఖ్య 4,440 గా మాత్రమే ఉంది. అంతేకాదు మొదట సోకినా వారిలో 2,655 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు నివేదికలు వెలువడ్డాయి.

ఐరోపా ఖండంలో మరణించిన వారి సంఖ్య 5,000 దాటింది, ఈ ఖండంలో అధిక మరణాలు ఇటలీ, స్పెయిన్ మరియు జర్మనీ లో ఉన్నాయి. ఇక్కడ కేసులు కూడా అధికంగానే ఉన్నాయి. స్పెయిన్ మరణాల సంఖ్య కూడా 1,000 కు పెరిగింది, ఇరాన్లో 1,400 కన్నా ఎక్కువ ఉంది. ఇదిలావుంటే ప్రపంచ వ్యాప్తంగా 235,000 మంది ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారని, 11,000 మందికి పైగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉందని ఆ దేశ ఆరోగ్య కేంద్రాలు స్పష్టం చేస్తున్నాయి.. కొత్త కేసులు కూడా పెద్దగా నమోదవడం కావడం లేదని వెల్లడిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories