మరణాల్లో 9కి ఎగబడిన భారత్.. మాస్క్ లేకపోతే 6నెలల జైలంటున్న ఉత్తరాఖండ్‌

మరణాల్లో 9కి ఎగబడిన భారత్.. మాస్క్ లేకపోతే 6నెలల జైలంటున్న ఉత్తరాఖండ్‌
x
Highlights

ఇంతవరకు కేసులు నమోదు, మరణాల్లో చివరిలో ఉండే తన స్థానం భారత్ లో పెరుగుతూ వస్తోంది.

ఇంతవరకు కేసులు నమోదు, మరణాల్లో చివరిలో ఉండే తన స్థానం భారత్ లో పెరుగుతూ వస్తోంది. లాక్ డౌన్ లో వెసులుబాటు ఇవ్వడంతో ఒక్కసారే కేసులు తీవ్రత ఎక్కువయ్యింది. దీనికి సరిపడా మెరుగైన చికిత్స పూర్తిస్థాయిలో అందకపోవడంతో అదే రీతిన మరణాల స్థానం పెరుగుతూ వస్తో్ంది. అయితే దీనిపై కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

భారత్‌ 9వ స్థానానికి చేరిందని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొంది. కేసుల్లో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో అత్యధికంగా 11,929 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మొత్తం రోగుల్లో ఇప్పటివరకు 1,62,378 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. 1,49,348 మంది చికిత్స పొందుతున్నట్లు వివరించింది. ఢిల్లీలో వరుసగా మూడో రోజూ 2 వేలు దాటాయి. దేశ రాజధానిలో అత్యధికంగా 2,224 మంది కరోనా బారినపడటం గమనార్హం. మహారాష్ట్రలో కొత్తగా 3,390 కేసులు రాగా.. 120 మంది చనిపోయారు.

ఉత్తరాఖండ్‌లో మాస్క్‌ లేకుంటే 6 నెలల జైలు

ఇప్పటివరకు మాస్క్ లేకుంటే కొన్ని ప్రభుత్వాలు జరిమానా విధిస్తుండగా, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తాజాగా ఆరు నెలల జైలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికిగాను అంటువ్యాధుల చట్టంలో కొన్ని మార్పులు చేసింది. జరిమానా విధిస్తున్నా జనాల్లో మార్పు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖానికి మాస్క్‌ లేకుండా ఎవరైనా రోడ్ల మీదకు వస్తే వారిని ఆరు మాసాల జైలుకు పంపేలా, రూ.5 వేల ఫైన్‌ విధించేలా 1897 నాటి అంటు వ్యాధుల చట్టంలో మార్పులు చేసింది. దీనికి గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ఆమోదముద్ర వేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories