భారత్ లో గత 24 గంటల్లో 1,553 కొత్త కేసులు నమోదు

భారత్ లో గత 24 గంటల్లో 1,553 కొత్త కేసులు నమోదు
x
Representational Image
Highlights

భారత్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో 1,553 కొత్త కేసులు, మొత్తం 543 మరణాలతో కేసుల సంఖ్య 17,265 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం తెలిపింది.

భారత్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో 1,553 కొత్త కేసులు, మొత్తం 543 మరణాలతో కేసుల సంఖ్య 17,265 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం తెలిపింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క కోవిడ్ -19 డాష్‌బోర్డ్ ప్రకారం, 2547 మందికి నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్ లో ఇప్పుడు 14,175 క్రియాశీల కేసులు ఉన్నాయి.. మరోవైపు మూడు రాష్ట్రాల్లో అధిక కేసులు ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే.. ఆ తరువాత ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో గుజరాత్ ఉంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 4203 కోవిడ్ -19 కేసులు, 223 మరణాలతో మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇక్కడ 507 మందిని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ సమాచారం. మహారాష్ట్ర తరువాత, 2000 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 2003 క్రియాశీల కేసులు ఉన్నాయి.. ఇక్కడ 72 డిశ్చార్జ్ మంది డిశ్చార్జ్ కాగా.. 45 మరణించారు. గుజరాత్ రాష్ట్రం కరోనా కేసులలో మూడవ స్థానంలో ఉంది.. ఇక్కడ కూడా కేసులు రెండు వేలకు చేరువ అవుతున్నాయి. ప్రస్తుతం 1911 పాజిటివ్ కేసులు ఉన్నాయి, వీటిలో 105 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories