Coronavirus: భారత్ లో 21 కి పెరిగిన కరోనా కేసులు.. తాజాగా మరో 16 మందికి..

Coronavirus: భారత్ లో 21 కి పెరిగిన కరోనా కేసులు.. తాజాగా మరో 16 మందికి..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

భారత్ లో కరోనా వైరస్ మెల్లగా విజృంభిస్తోంది. తాజాగా మరికొందరికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్...

భారత్ లో కరోనా వైరస్ మెల్లగా విజృంభిస్తోంది. తాజాగా మరికొందరికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే మరో 15 మంది టూరిస్టులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారికీ కూడా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. అలాగే ఇక బెంగుళూరులో మరోస్ వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని.. అతను సౌదీ నుంచి వచ్చినట్లు గుర్తించారు.

మరో 15 మంది ఇటాలియన్ పర్యాటకులు, వైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయించుకున్నారని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ధృవీకరించింది. మొత్తం 15 మంది ఇటాలియన్ పర్యాటకులను చావ్లాలోని ఐటిబిపి సౌకర్యం వద్ద ఉంచారు. దీంతో దేశంలో ధృవీకరించబడిన కేసులు 21 కి పెరిగాయి, ప్రారంభంలో పాజిటివ్ పరీక్షించిన కేరళకు చెందిన ముగ్గురు వ్యక్తులు కోలుకున్నారు. వారు తిరిగి సౌదీకి వెళ్ళారు.

ఇదిలావుండగా వైరస్ సోకిన వ్యక్తి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడు, అతని కొడుకు నోయిడాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు ఆ విద్యార్థిని చూసి మిగతా విద్యార్థులు భయపడుతున్నారు. దాంతో స్కూల్ యాజమాన్యం మూడు రోజుల పాటు సెలవు ప్రకటించింది. మరోవైపు ఆ వ్యక్తి... ఇటీవల ఆగ్రాలోని తన బంధువుల్ని కలిశాడు. వారిలో ఆరుగురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తన కొడుకు పుట్టిన రోజు వేడుకల్ని కూడా ఢిల్లీలో జరిపించాడు.

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య తొంభైవేలు దాటింది. మృతుల సంఖ్య 3000 దాటినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పది దేశాల్ని పరిశీలిస్తే... అవి చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్, అమెరికాగా నమోదయ్యాయి.

ఇప్పటివరకు, భారతదేశంలో 438 మందిని అనుమానితులుగా నివేదించారు, వారిలో 225 మంది 28 రోజుల నిర్బంధం పూర్తి చేశారు.. 189 మంది ఇంకా వైద్యుల పరిశీలనలో ఉన్నారు. అలాగే 89 మందిని ఒంటరిగా ఉంచారు. మరోవైపు కరోనా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇవాళ హై లెవల్ సమావేశం నిర్వహించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories