జపాన్ క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న 138 భారతీయులు

జపాన్ క్రూయిజ్ షిప్ లో చిక్కుకున్న 138 భారతీయులు
x
Highlights

జపాన్ లో ప్రస్తుతం నిర్బంధలో క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్‌లోని 3,700 బేసి ప్రయాణీకులు మరియు సిబ్బందిలో 138 భారతీయులు ఉన్నట్టు తెలిసింది. అందులో...

జపాన్ లో ప్రస్తుతం నిర్బంధలో క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్‌లోని 3,700 బేసి ప్రయాణీకులు మరియు సిబ్బందిలో 138 భారతీయులు ఉన్నట్టు తెలిసింది. అందులో 136 మంది సిబ్బంది కాగా ఆరుగురు సాధారణ ప్రయాణికులు ఉన్నారు. వీరు ప్రస్తుతం వైద్యుల నిర్బంధంలో ఉన్నారు. ఇప్పటికే 63 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే వారిలో భారతీయులు లేరని తెలిసింది. ఈ 63 మంది ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. జపాన్ షిప్ లో భారతీయులు ఉన్న విషయాన్నీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. వారు క్షేమంగా ఉన్నారని.. వారిలో ఎవరికీ కరోనావైరస్ పాజిటివ్ లేదని చెప్పారు. అక్కడ ఎంబసీ అధికారులతో తాజా సమాచారాన్ని మానిటరింగ్ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక జపాన్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వీరంతా తమ నిర్బంధంలో ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఓడకు అదనపు వైద్య నిపుణులు.. వారిలో 16 మంది వైద్యులు మరియు 12 మంది అదనపు సిబ్బంది (ఇందులో నర్సులు మరియు గుమాస్తాల బృందాలు) ఉన్నారు. అలాగే 7,000 రక్షిత ఫేస్ మాస్క్‌లను అందించినట్టు పేర్కొంది. ఈ నెల 19 వరకు ఓడలోని 3,700 ప్రయాణికులు నిర్బంధంలో ఉంటారని స్పష్టం చేసింది. జపాన్‌లో కరోనా వైరస్ మరణాలు సంభవించలేదని.. డైమండ్ ప్రిన్సెస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ 28 రోజులు తమ నిర్బంధలో అక్కడే ఉండాల్సి ఉంటుందని జపాన్ ఆరోగ్య అధికారులు అరటా యమమోటో , ఫిల్ హెల్సెల్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా హాంకాంగ్‌లో కరోనావైరస్ కోసం పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రయాణీకుడు గత నెల చివర్లో ఈ ఓడ ఎక్కాడు దాంతో ఈ వైరస్ అందరికి సోకింది. ఇదిలావుంటే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా చైనా భూభాగంలో 700 మందికి పైగా మరణించారు. ఇందులో ఫిలిప్పీన్స్ లో ఒకరు హాంకాంగ్ లో మరొకరు ఈ వైరస్ బారిన పడి మృతిచెందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories