కరోనా వైరస్ : ఈ -వీసాల తాత్కాలికంగా నిలిపివేత

కరోనా వైరస్ : ఈ -వీసాల తాత్కాలికంగా నిలిపివేత
x
భారత్‌లో మూడో కరోనా కేసు
Highlights

చైనా పాస్‌పోర్ట్‌లు ఉన్న వారికి, చైనాలో నివాసం ఉంటున్న ఇతర దేశాల వారికి భారత్ వీసా జారీ తాత్కాలికంగా నిలిపివేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇటు భారతదేశ ప్రజల్ని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. చైనా నుంచి భారత్‌లో ముగ్గురు కేరళ వాసులకు కరోనా వైరస్‌ సోకినట్టుగా నిర్దారణ కావడంతో అప్రమత్తమైంది. కేరళ రాష్ట్రంలో నమోదైనా మూడు కరోనా సోకిన వ్యక్తులను పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు సోమవారం కేబినెట్‌ సెక్రటరీ అధ్యక్షతన కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలపై సమీక్ష జరిగింది. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చైనా నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చైనా పాస్‌పోర్ట్‌లు ఉన్న వారికి, చైనాలో నివాసం ఉంటున్న ఇతర దేశాల వారికి భారత్ వీసా జారీ తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌కు వచ్చిన 58,658 మంది ప్రయాణీకులక ల్లో 142 మంది కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తించారు. వారి కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మంది నమూనాలు నెగెటివ్‌ ఉందని తేలింది.

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. వుహాన్‌ నుంచి తాజాగా వచ్చిన 330 మంది ప్రయాణీకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.మరోవైపు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సన్నాహక చర్యలపై సోమవారం కేబినెట్‌ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చైనా నుంచి తిరిగివచ్చినవారు ఇంటికే పరిమితం కావాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories