
కరోనా వైరస్ భారత దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అయితే దేశంలో కరనా వైరస్ ముగ్గురికే ఉందనీ, వాళ్లు కూడా కోలుకుంటున్నట్లు అవుతున్నారని వార్తలు...
కరోనా వైరస్ భారత దేశంలోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. అయితే దేశంలో కరనా వైరస్ ముగ్గురికే ఉందనీ, వాళ్లు కూడా కోలుకుంటున్నట్లు అవుతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో ముగ్గురికి కరోనా వ్యాపింది. దీంతో ఢిల్లీలో, జైపూర్‌లో , తెలంగాణతో కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాపై రకాల సూచనలు చేస్తున్నారు. కరోనా రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బరి నుంచి తప్పించుకోవచ్చు.
ఉష్ణోగ్రతలు కారణంగా కరోనా రాదని మనం అనుకున్నాం. కానీ నిజం కాదని వైద్యులు అంటున్నారు. సౌదీ అరేబియా వంటి వేడి వాతావరణంలోనే కరోనా సోకిందంటే భారత్ కు వచ్చే అవకాశం లేకపోలేదని అధికారులు అంటున్నారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిలో కరోనా ఉంటే అది ఇతరులకు చెందుతుందని అంటున్నారు.
1.కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్త పడగలం. అందులో మొదటిది. బయట వస్తువులను తాకరాదు. బస్సుల్లో, ఆటోల్లో, రైళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, విమానాల్లో.. వస్తువులను మనం తాకకుండా ఉండాలి. ప్రయాణ సమయంలో హ్యాండ్ శానిటైజర్ వాడటం మంచి సూచన.
2.గాలీ ద్వారా కరోనా సోకదు. ఇది గాలి ద్వారా సోకే వైరస్ కాదు. గుంపుగా జనం ఉన్నా కోవిడ్ ఉండదు. కానీ ఆ జనంలో ఏవరికైనా కరోనా ఉంటే మాత్రం.. అప్పుడు వచ్చే ప్రమాదం ఉంది.
3. కరోనా వ్యాధి గ్రస్తులు తుమ్మినా, దగ్గినా, ఎదుట వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. ఇప్పుడు కరోనా ప్రభలుతున్న సమయం కాబట్టి బయట ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.
4. ఎల్లప్పుడూ చేతులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కాస్త జలుబు, దగ్గు, నీరసం, ఆయసం ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతుంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం బెటర్.
5. అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. కరోనా వైరస్ ఉన్నవారికి మనం దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండాలి. శక్తి పెరగాలంటే పండ్లు, ఆకు కూరలు, ముఖ్యంగా సీ విటమిన్ ఉన్నవి అయితే మరీ మంచివి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది. కేరళలో కరోనా సోకినా ముగ్గురూ అలాగే రికవరీ అయ్యారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




