Corona Vaccines Update in India: చివ‌రి ద‌శ‌లో దేశీ క‌రోనా వ్యాక్సిన్!

Corona Vaccines Update in India:  చివ‌రి ద‌శ‌లో దేశీ క‌రోనా వ్యాక్సిన్!
x
Corona Vaccines Update in India:
Highlights

Corona Vaccines Update in India: ప్ర‌పంచ దేశాలు కరోనా మ‌హ‌మ్మారి వల్ల త‌మ ప్రాణాల‌ను గుప్పిట్లో పెట్టుకుని బ‌తుకుతున్నారు. ఏ రోజుకైనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఓ శుభవార్త చెప్పింది.

Corona Vaccines Update in India: ప్ర‌పంచ దేశాలు కరోనా మ‌హ‌మ్మారి వల్ల త‌మ ప్రాణాల‌ను గుప్పిట్లో పెట్టుకుని బ‌తుకుతున్నారు. ఏ రోజుకైనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఓ శుభవార్త చెప్పింది. భారత్‌లో అభివృద్ధి చేస్తున్న వాక్సిన్స్‌లు త‌ర్వ‌లోనే ముందుకు వ‌స్తాయ‌ని వ్యాక్సిన్ పంపిణీ సాంకేతిక క‌మిటీ చైర్మ‌న్, నీతి ఆయోగ్ స‌భ్యుడు వీకే పాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయ‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ త‌న ఆగ‌స్టు 15 ఎర్ర‌కోట ప్ర‌సంగంలో చెప్పిన‌ట్లుగానే క‌రోనా వ్యాక్సిన్ పై అడుగులు ప‌డుతున్నాయ‌న్నారు. వీటిలో ఓ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌కి సిద్ధమైనట్టు వీకే పాల్ వెల్లడించారు. దేశంలో భార‌త్ బ‌యోటెక్ త‌యారు చేసిన కోవాక్జిన్ మూడో ద‌శ క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ ప్రారంభ ద‌శ‌లో ఉండ‌గా, జైడ‌స్ క్యాడిల్లా, ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ త‌యారు చేసిన వ్యాక్సిన్ ను సీరం ఇన్సిట్యూట్ మూడో ద‌శ క్లినిక‌ల్ ప్రయోగాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని తెలిపారు.

దేశంలో మూడు కోట్ల మందికి పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ తెలిపారు. గడిచిన 24గంటల్లోనే 8,99,864మందికి పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడినవారిలో 19.70లక్షల మంది క‌రోనా ను జ‌యించి, డిశ్చార్జి అయ్యారని తెలిపింది. దేశంలో మరణాల రేటు 2శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 73.18% కాగా.. యాక్టివ్‌ కేసులు 24.91%, మరణాల రేటు 1.92%గా ఉన్నాయని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories