logo
జాతీయం

Corona updates in Tamil nadu: త‌మిళ‌నాట క‌రోనా క‌ల్లోలం

Corona updates in Tamil nadu: త‌మిళ‌నాట క‌రోనా క‌ల్లోలం
X
Corona rep image
Highlights

Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా క‌రాళ నృత్యం చేస్తుంది.రోజూ వేలల్లో కేసులు నమోదు అవుతుండడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా క‌రాళ నృత్యం చేస్తుంది.రోజూ వేలల్లో కేసులు నమోదు అవుతుండడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,785 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,749కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 53,132 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం నాటికి 6,504 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో వీరి సంఖ్య 1,43,297 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 88 మంది కరోనాతో మృతి చెందగా ఇప్పటివరకు 3,320 మంది మరణించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు.

అలాగే దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్ర‌పంచ క‌రోనా కేసుల్లో భార‌త్ 3వ స్థానానికి చేరింది . దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,287,945 కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,40,135యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 8,17,209మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 30,601మంది మరణించారు.

Web TitleCorona updates in Tamil nadu
Next Story