దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Corona cases that have increased massively in the country
x

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Highlights

Corona cases: *ఇవాళ కొత్తగా 12,213 కేసులు నమోదు

Corona cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది. ముందురోజు కంటే 38.4 శాతం అధికంగా రావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం 5.19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..12వేల, 213 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 4వేల, 024, కేరళలో 3వేల, 488, ఢిల్లీ, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది.

ఒక్క ముంబయిలోనే నిన్న 2 వేలకుపైగా కేసులొచ్చాయి. 5 నెలల తర్వాత అక్కడ అవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. ఢిల్లీలో వరుసగా రెండోరోజు 1,100 మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఈ రెండేళ్లలో మొత్తం 4.32 కోట్ల మందికి ఈ మహమ్మారి సోకింది. తాజా విజృంభణతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 58వేల, 215 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 7వేల,624 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 4.26 కోట్ల మందికిపైగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.66 శాతంగా కొనసాగుతోంది. కరోనాతో నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories