Corona Cases in India: దేశంలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్

Corona Cases in India: *కొత్తగా 5,476 పాజిటివ్ కేసులు ... 158 మరణాలు *దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు

Rama Rao
Published on: 6 March 2022 11:16 AM IST
Corona Cases is in Decline in the Country | Telugu Online News
X

దేశంలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్

Corona Cases in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులు ఐదున్నర వేలకు దిగి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 9,09,985 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,476 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజు వ్యవధిలో 158 మంది మహమ్మారితో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5లక్షల 15వేల 36కు చేరింది. కోవిడ్ నుంచి తాజాగా 9,754మంది కోలుకోగా ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4కోట్ల 23లక్షలు దాటింది. ప్రస్తుతం దేశంలో 59,442 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 26,19,778 మంది టీకాలు వేయించుకోగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 178 కోట్లు దాటింది.

Rama Rao

Rama Rao

Next Story