Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం

Corona Cases Hiking in India
x

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: రోజు రోజుకు పెరుగుతున్న కొవిడ్ బాధితులు * మహమ్మారి బారిన పడి చనిపోతున్న కరోనా పేషెంట్లు

Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఉత్పాతంలా ఉరుములేని పిడుగులా ఆకస్మికంగా ప్రపంచం నెత్తిపై పడింది. ఇదేదో చిన్న క్రిమి కాదు ప్రజల ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా తీసే అతిపెద్ద మహమ్మారని త్వరలోనే అర్ధమైంది. అయినా దానిని కట్టడి చేయలేకపోతున్నాం ఎన్నో ప్రకృతి విలయాలు, ప్రాణాంతక వ్యాధుల్ని మించి కరోనా చెలరేగిపోతున్నారు.

ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు చనిపోయిన వారి సంఖ్య కంటే కరోనాతో మరణించిన వారే ఎక్కువగా ఉంటున్నారు. సునామీలు, భూకంపాలు, వరదలు, తుపానులు, హరికేన్లు ఇలాంటి ప్రకృతి విలయాలు చేసే విధ్వంసంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాని కంటే ఎక్కువగా మానవాళి మరెన్నో భయంకరమైన మహమ్మారుల్ని ఎదుర్కొంది. వారి కంటే కొన్ని ప్రాణాంతక వ్యాధుల్ని మించి కరోనా మనల్ని పీడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చాక జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

ఈనెల 17 నాటికి ప్రపంచంలో కరోనాతో 30 లక్షలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారని WHO వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో సగం 7 దేశాల్లోనే నమోదయ్యాయి. 20 ఏళ్లలో సంభవించిన ప్రకృతి విలయాల్లో మరణాల కంటే కరోనాయే ఎక్కువ ఉసురు తీసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలు, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలి మరణాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని, గత 20 ఏళ్లలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలతో పోల్చి చూసింది. జీవించాల్సిన దాని కంటే ముందుగా ఎంత మంది మరణించారో లెక్కలు వేసింది. గత ఏడాదిలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి కంటే కోవిడ్ బారిన పడి ముందస్తుగా మరణించిన వారు ఆసియాలో మూడు రెట్లు ఎక్కువగా ఉంటే యూరప్‌లో 30 రెట్లు ఎక్కువగా ఉంది.

2000-2019 మధ్య సంభవించిన ప్రకృతి విలయాలతో మరణించిన వారు 9.4 లక్షల మంది అని UNADRR వెల్లడిచింది. 2004లో ఇండియా, ఇండోనేసియా దేశాల్లో వచ్చిన సునామీ, 2008లో మయన్మార్‌ని ముంచేసిన నర్గీస్ తుపాన్, 2010లో హైతిలో వచ్చిన భూకంపం సృష్టించిన ప్రాణనష్టం కంటే ఈ కరోనా వల్లే చనిపోయిన వారి సంఖ్య అధికం

Show Full Article
Print Article
Next Story
More Stories