కరోనా కొత్త వేవ్‌పై అనుమానాలు

Corona Cases Are Increased In India
x

Corona Cases in India: కరోనా కొత్త వేవ్‌పై అనుమానాలు

Highlights

Corona Cases in India: మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన

Corona Cases in India: మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తుందా? అంటే.. అవుననే ఫ్రాన్స్‌ చెబుతోంది. ఆ దేశంలో ప్రస్తుతం భారీగా కేసులు నమోదువుతున్నాయి. రెండు నెలల తరువాత మళ్లీ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొత్త వేవ్‌ వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము కొత్త వేవ్‌ను ఎదుర్కొంటున్నట్టు ప్రాన్స్‌ వ్యాక్సిన్‌ చీఫ్‌ అలైన‌ ఫిషర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫ్రాన్స్‌లో కరోనా కేసుల పెరుగుదలను చూస్తుంటే.. మరోసారి వైరస్‌ కల్లోలం సృష్టించనున్నట్టు స్పష్టం చేశారు. కొత్త వేవ్‌ తీవ్రత ఎంత ఉంటుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఫిషర్‌ హెచ్చరించారు.

ఇటీవల ఫ్రాన్స్‌లో ఇటీవల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మే చివర్లో 20వేలకు దిగువన ఉన్న కేసులు.. మూడు వారాల్లో మూడు రెట్లు అధికమయ్యాయి. తాజాగా 50వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌కు పొరుగున ఉన్న పోర్చుగల్‌, స్పెయిన్‌లోనూ కొత్త కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. దీంతో మరో వేవ్‌ వస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐరోపా దేశాల్లో ప్రధానంగా ఒమిక్రాన్‌ వైరింట్‌ విజృంభిస్తోంది. అయితే ప్రజలు చాలవరకు కోవిడ్‌ టీకా తీసుకోవడంతో లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అయితే ప్రజలు అప్రమత్తంగా లేకపోతే.. ప్రమాదమేనని స్పష్టం వైద్యులు చేస్తున్నారు.

భారత్‌లోనూ ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గి.. మరో రోజు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా 13వేల 313 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 38 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 84వేలకు చేరువయ్యాయి. ఒక్క రోజులో 2వేల 303 కేసులు అదనంగా పెరిగాయి. రోజువారి పాజిటివ్‌ రేట్ 2.03గా నమోదయ్యింది. అత్యధికంగా కేరళలో 4వేల 224, మహారాష్ట్రలో 3వేల 260, ఢిల్లీలో 928, తమిళనాడులో 771, యూపీలో 678 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో 434, ఏపీలో 86 కేసులు నమోదయ్యాయి.

కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టీకాలు తీసుకున్నవారికి కూడా కరోనా సోకుతోంది. ముఖ్యంగా చిన్నారులకు వైరస్ సోకుతుండడంతో తల్లిదండ్రల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కరోనా లక్షణాలు బయటపడుతున్నా.. ఆసుపత్రుల్లో చేరికలు లేవని.. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళాడుల్లో కేసులు భారీగా పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పూర్తిగా అంతమవ్వలేదని.. తక్షణమే వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories