పెళ్లికి ముందు వివాహేతర సంబంధం... అత్యాచారం కాదు: హైకోర్టు

పెళ్లికి ముందు వివాహేతర సంబంధం... అత్యాచారం కాదు: హైకోర్టు
x
Highlights

పెళ్లి చేసుకుంటానని యువతిని ప్రలోభ పెట్టి వివాహేతర సంబంధం నెరపడం అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు అభిప్రాయపడింది.

పెళ్లి చేసుకుంటానని యువతిని ప్రలోభ పెట్టి వివాహేతర సంబంధం నెరపడం అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు అభిప్రాయపడింది. తప్పుడు వాగ్దానంపై లైంగిక సంబంధం కలిగి ఉండటం అత్యాచారానికి సమానం కాదని, ఒరిస్సా హైకోర్టు శనివారం తీర్పునిస్తూ, 19 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు యువకుడిని అరెస్టు చేయాలన్న అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది.

చట్టం ప్రకారం, వివాహం ముందు ప్రలోభ పెట్టి మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు నిర్ధారించబడితే ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తిస్తారు.. అయితే 'పెళ్లి చేసుకుంటామని భావించిన కొందరు యువతీయువకులు శారీరకంగానూ కలుస్తున్నారు. ఈ క్రమంలో యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని యువతులు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించకూడదని ఒడిశా హైకోర్టు స్పష్టం చేసింది.

2019లో పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో జి అచ్యుత్ కుమార్ అనే యువకుడు 19 ఏళ్ల యువతితో శారీరక సంబంధం పెట్టుకొని.. తర్వాత పెళ్లికి నిరాకరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో భాగంగా తాను రెండుసార్లు గర్భవతి అయినప్పుడు కుమార్ తనకు కొన్ని మందులు ఇచ్చి గర్భం తీసేయించాడని ఆమె ఆరోపించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విషయం కాస్త కోర్టుకు చేరింది. అయితే శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ పైవిధంగా అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు జస్టిస్‌ ఎస్‌.కె.పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం ఇలా పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories