UT Khader: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా నామినేషన్ వేసిన ఖాదర్‌

Congress UT Khader Files Nomination for Karnataka Speaker
x

UT Khader: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా నామినేషన్ వేసిన ఖాదర్‌ 

Highlights

UT Khader: ఖాదర్‌కు మద్దతుగా నామినేషన్ పత్రాలపై.. సంతకాలు చేసిన సిద్దరామయ్య, డీకే శివ కుమార్‌

UT Khader: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా మలయాళీ కాం‍గ్రెస్‌ నేత యూటీ ఖాదర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌లు అధినేత ఖాదర్‌కు మద్దతుగా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఖాదర్‌ విధాన సభ ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించారు. ఖాదర్‌ గత కర్ణాటక అసెంబ్లీలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాదర్‌ దాదాపు 22వేల7వందల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సతీష్‌ కుంపలాపై విజయం సాధించారు.అంతేకాదు అంతకమునుపు సిద్ధరామయ్య ప్రభుత్వం హయాంలో హౌసింగ్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్‌ ఆరోగ్యం, ఆహారం పౌర సరఫరాల మంత్రిగా కూడా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories