Bihar polls: 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

Bihar polls: 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
x
Highlights

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ..

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , ఎంపీ రాహుల్ గాంధీ ఈ ప్రచారానికి నాయకత్వం వహించారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు షత్రుఘన్ సిన్హా, రాజ్ బబ్బర్ కూడా ఉన్నారు. భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) కు పంపిన కాంగ్రెస్ ప్రకటనలో, మూడు దశల ఎన్నికలకు అసమ్మతి నాయకులు గులాం నబీ ఆజాద్, సచిన్ పైలట్ , సంజయ్ నిరుపమ్లను కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది కాంగ్రెస్.

అయితే, కోవిడ్ భయం కారణంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలాంటి బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడటం లేదని వర్గాలు సూచించాయి. మరోవైపు ప్రతి దశలో రెండు బహిరంగ సభలు, ఆరు ర్యాలీలలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ ర్యాలీలలో గ్రాండ్ అలయన్స్ పార్టీ నేతలు కూడా ఉంటారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా మూడు దశల్లో మూడు లేదా నాలుగు బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది.

లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్, అమరీందర్ సింగ్, భూపేశ్ బాగెల్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తారిక్ అన్వర్, రణదీప్ సుర్జేవాలా, షకీల్ అహ్మద్, కీర్తి ఆజాద్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. స్టార్ క్యాంపెయినర్ లలో బీహార్ నేత శక్తిసింహ్ గోహిల్, బీహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్.. శాసనసభా పక్ష సదానంద్ సింగ్ కూడా ఉన్నారు. మొదటి దశ బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28 న, రెండవ దశ నవంబర్ 3 న, మూడవ దశ నవంబర్ 7న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories