పంజాబ్‌ సీఎంగా సుఖ్‌జిందర్ రణ్‌ధావా..??

Congress Party High Command May Announce Sukhjinder Singh Randhawa as New Punjab Chief Minister
x

సుఖ్‌జిందర్ రణ్‌ధావా

Highlights

* సుఖ్‌జిందర్‌ను ఎంపిక చేసిన హైకమాండ్ *మెజార్టీ ఎమ్మెల్యేలు సుఖ్‌జిందర్‌ వైపే మొగ్గు *త్వరలో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఎంపిక

Sukhjinder Singh Randhawa: పంజాబ్‌ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీలో వివాదరహితుడగా పేరున్న సుఖ్‌జిందర్‌ సింగ్‌ రణ్‌దవాను ఎంపిక చేశారు. పంజాబ్‌కు కేంద్ర ప‌రిశీల‌కులుగా వ‌చ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి హ‌రీష్ రావ‌త్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎమ్మెల్యేలతో సుధీర్ఘ చర్చలు జరిపారు. అయితే ఎమ్మెల్యేలంతా సుఖ్‌జింద‌ర్ సింగ్ పేరును ప్రతిపాదించడంతో ఆయననే సీఎంగా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

పంజాబ్ కాంగ్రెస్‌లో గ‌త 5నెల‌లుగా అంతర్గత విభేదాలు తలెత్తాయి. మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్, పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూల మ‌ధ్య వర్గపోరు మొద‌లైంది. కాంగ్రెస్ హైక‌మాండ్‌ హెచ్చరించినా వివాదం సద్దుమణగలేదు. దీంతో సీఎం మార్పు అనివార్యమైంది. అయితే తనను పార్టీ హైక‌మాండ్ అవ‌మానించింద‌ని అమరీందర్ సింగ్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories