
కరోనా కాటుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలయ్యారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
కరోనా కాటుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలయ్యారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.అహ్మదాబాద్ లోని డానిలిమాడా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాజీ ప్రతిపక్ష నాయకుడు బద్రుద్దీన్ షేక్ కరోనా సంక్రమణతో మరణించారు. ఇటీవల ఆయాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం మరింత విషమించి ఆదివారం మృతిచెందారు.. ఆయనకు రక్తపోటు తోపాటు డయాబెటిస్ ఉన్నాయి, ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఆయన మరణించిన విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శక్తి సింగ్ గోహిల్ తెలియజేశారు.తనకు బద్రుద్దీన్ షేక్ 40 ఏళ్లుగా తెలుసునని, అప్పుడు యూత్ కాంగ్రెస్‌లో ఉండేవాడని ఆయన అన్నారు. కాగా బద్రుద్దీన్ గుజరాత్ విశ్వవిద్యాలయ సిండికేట్ సభ్యుడిగాను.. 2000 నుండి 2003 వరకు AMC స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గాను పనిచేశారు. బద్రుద్దీన్ మృతిపట్ల రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఇదిలావుంటే డానిలిమాడా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కరోనాకేసులున్నాయి.. దాంతో ఈ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా గుర్తించారు. మరోవైపు గుజరాత్ లో మొత్తం 3,071 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 133 మంది మరణించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



