జార్ఖండ్ ఫలితాల్లో అధికార పార్టీకి పెద్ద షాక్

జార్ఖండ్ ఫలితాల్లో అధికార పార్టీకి పెద్ద షాక్
x
Highlights

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెన్‌-జేఎంఎం-ఆర్జేడీ కూటమి మెజార్టీ స్థానాలను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఆ రాష్ట్ర ముఖ‌్యమంత్రి రఘుబర్‌ దాన్‌ తాజా ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారు. జంషెడ్‌పూర్‌ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ రెబల్స్‌ మాజీ మంత్రి సర్యూరాయ్‌.. రఘుబర్‌ దాన్‌పై 2,500 పైచిలుకు ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూడా కాంగ్రెస్ కూటమీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎగ్గిట్ అంచనాలు నిజమవుతున్నట్లు కన్సిస్తున్నాయి.

తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఇప్పటికే కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలిచి మరో 10 చోట్ల ముందంజలో ఉండగా, జేఎంఎం ఐదు స్థానాల్లో గెలిచి 29 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఆర్జేడీ 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తంగా ఈ కూటమి 5 స్థానాల్లో జోరు కొనసాగిస్తోంది. మొత్తం 28 స్థానాలతో జేఎంఎం అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. దీంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని హేమంత్‌ మరికొద్ది గంటల్లో గవర్నర్‌ను కోరే అవకాశముంది.

ఇక అధికార బీజేపీ ప్రస్తుతం 6 చోట్ల విజయం సాధించింది. మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏజేఎన్‌యూ ఒక చోట విజయం సాధించింది. మరో 2స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జేవీఎం మూడు చోట్ల ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories