Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితి అయోమయం

Congress High Command Deciding to Appoint New PCC Chief to Punjab
x

పంజాబ్ కు కొత్త పీసీసీ నియమించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం (ఫైల్ ఇమేజ్)

Highlights

Punjab: సిద్ధూ రాజీనామా నేపథ్యంలో కేబినెట్ అత్యవసర భేటీ

Punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. రోజుకోవిధంగా మారిపోతున్నాయి అక్కడి పరిస్థితులు. సిద్ధూ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులను సిద్ధూ అర్థం చేసుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. సిద్ధూ రాజీనామా నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు సీఎం చరణ్ జీత్ సింగ్ అత్యవర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీ అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

పీసీసీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించారు నవజోత్ సింగ్ సిద్ధూ. పంజాబ్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. పంజాబ్ కోసమే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. తాను రాజీపడే ప్రసక్తే లేదని, సత్యం కోసం పోరాటం చేస్తానన్నారు. ఈ పోరాటం తన వ్యక్తిగతం కాదని తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా వైరం లేదన్నరాయన. ప్రజల జీవితాలు మార్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న సిద్ధూ ప్రజలకు మేలు చేయాలనేదే తన అభిమతం అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories