కరోనా కట్టడికి ప్రధాని మోడీకి సోనియా సూచనలు

కరోనా కట్టడికి ప్రధాని మోడీకి సోనియా సూచనలు
x
Sonia Gandhi (File Photo)
Highlights

కరోనా కట్టడికి చేయడానికి ప్రధాని మోడీకి అయిదు సూచనలు చేశారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ..

కరోనా కట్టడికి చేయడానికి ప్రధాని మోడీకి అయిదు సూచనలు చేశారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖను రాశారు సోనియా.. కరోనా వైరస్ కట్టడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి సలహాలు కోరిన నేపథ్యంలో సోనియా గాంధీ లేఖ రాశారు. రెండేళ్లపాటు మీడియా (టీవీ, ప్రింట్, ఆన్‌లైన్)కు ప్రభుత్వం రెండేళ్లపాటు ప్రకటనలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. నూతన పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును వెంటనే ఆపివేయాలని, ప్రస్తుత చారిత్రాత్మక పార్లమెంటులోనే కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు.

ఇక ఎంపీల జీతాలను 30 శాతం తగ్గించాలని సోమవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే దీనికి సోనియా మద్దతు తెలిపారు. పీఎం కేర్ ఫండ్‌కు వచ్చిన విరాళాలను పీఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకోవాలని, కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని తెలిపారు. ఈ నిధులను కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి విస్తృతంగా ఉపయోగించుకోవచ్చునని ఆమె వ్యాఖ్యానించారు.

ఇక భారత్ లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా భాదితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వ‌ర‌కు భార‌త్‌లో కరోనా వైర‌స్ వ‌ల్ల 117 మంది చ‌నిపోగా, 4421 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories