జార్ఖండ్‌: ఎవరీ హేమంత్‌సోరెన్..

జార్ఖండ్‌: ఎవరీ  హేమంత్‌సోరెన్..
x
Highlights

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ - జేఎంఎం కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా ప్రభుత్వ ఏర్పాటుకు 42 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. 21 స్థానాల్లో బీజేపీ ముందజలో కొనసాగుతోంది. ఇతరులు మిగతా స్థానాల్లో విజయం దిశగా పయనిస్తున్నారు.

కాగా, ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ - జేఎంఎం కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్‌- జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీ రావడంతో జార్ఖండ్‌ కాబోయే సీఎం జేఎంఎం అధ్యక్షుడు హేమంత్‌ సొరేన్‌‌నే అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ -జేఎంఎం 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో బీజేపీ పలు స్ధానాల్లో ఆధిక్యం లభించింది. అయితే అన్ని స్థానాల్లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల నుంచి దీటైన పోటీ ఉంది.


జార్ఖండ్ సీఎం రఘువర్‌ దాస్‌కు ఫలితాలు షాక్‌ ఇచ్చేలా ఉన్నాయి. ఆయన పోటీ చేసిన జంషెడ్‌పూర్‌ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘువర్‌దాస్‌ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ రెబల్‌ అభ్యర్థి సర్యూరాయ్‌ 2వేల ఓట్లపైగా ఆధిక్యంలో ఉన్నారు.

సొరెన్ గురించి తెలుసు కోవడానికి నెటిజన్లు ఆసక్తి కనబరస్తున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి షిబు సోరెన్ కుమారుడే ఈ హేమంత్ సోరెన్. హేమంత్‌ కష్టకాలంలో పార్టీ ఎదుగుదలలో ఎంతో కృషి చేశారు. జార్ఖాడ్ ఫలితాల తర్వాత ఆయన సాదాసిదా జీవితం గడిపిన పోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయితున్నాయి.

అయితే కాంగ్రెస్ - జెఎంఎం విజయం దాదాపు ఖాయం కావడంతో సోరెన్ సీఎం పీఠం అధిరోహించే ఛాన్స్ ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ కూటమికి స్పష్టమైన ఫలితాలు రావడంతో ఢిల్లీలోని కాంగ్రెప్ పార్టీ ప్రధానా కార్యాలయంలో పార్టీ శ్రేణలు సంబరాలు జరుపుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories