విపక్ష నేతల ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారు

విపక్ష నేతల ఫోన్లు హ్యాక్‌ చేస్తున్నారు
x
Highlights

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కాంగ్రెస్ పార్టీ విమర్శులు గప్పించింది. విపక్షలకు చెందిన అందరి ఫోన్లను ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందని ఆరోపించింది. ప్రియాంక...

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కాంగ్రెస్ పార్టీ విమర్శులు గప్పించింది. విపక్షలకు చెందిన అందరి ఫోన్లను ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందని ఆరోపించింది. ప్రియాంక గాంధీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిందని విమర్శించింది. వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ వాట్సాప్‌ సర్వర్ల ద్వారా దాదాపు 20 దేశాలకు చెందిన1400 మంది వినియోగదారులను టార్గెట్‌ చేసిందని సామాజిక మాధ్యమాలైనా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గతవారం పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తన మొబైల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాంపింగ్‌ చేసిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories