దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

Congress Agitations Across the Country
x

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

Highlights

Congress: నిరుద్యోగం, ధరల పెరుగుదలపై నిరసనలు, పార్లమెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీ

Congress: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌లకు దిగుతోంది. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ధ‌ర‌ల మంటపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. పార్లమెంటు నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యుల ఆధ్వర్యంలో ర్యాలీ జ‌ర‌గ‌నుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ నేత‌లు, కార్యకర్తలు ఆందోళ‌న‌ల్లో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ ఆందోళ‌న‌లకు దిగుతున్న నేప‌థ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం స‌మీపంలో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత‌లు, కార్యక‌ర్తలను అడ్డుకునేందుకు పోలీసులు చ‌ర్యలు తీసుకుంటున్నారు. జంత‌ర్ మంత‌ర్ మిన‌హా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప‌లు రాష్ట్రాల్లోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories