Donald Trump: భారత్‌-అమెరికా మైత్రికి ప్రభుత్వాలతో సంబంధం లేదు

Donald Trump: భారత్‌-అమెరికా మైత్రికి ప్రభుత్వాలతో సంబంధం లేదు
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశంలో...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు... తొలుత ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. ట్రంప్‌కు మరోసారి స్వాగతమని చెప్పారు. 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందిని మోదీ అన్నారు. భారత్‌-అమెరికా స్నేహ బంధానికి ప్రభుత్వాలతో సంబంధం లేదని.. ప్రజలు కేంద్రంగానే స్నేహం బలోపేతం అవుతుందని తెలిపారు. రెండు దేశాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.

భాతర రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరబోతున్నాయని వెల్లడించారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌, అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ తయారు చేశామని మోదీ తెలిపారు. భారత్‌, అమెరికా వాణిజ్యపరంగా సమాన అవకాశాలకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. ఈ 21వ శతాబ్దానికి అమెరికా -భారత్‌ స్నేహం ముఖ్యమైంది. దేశ రక్షణ, ఐటీ వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. భారత సైన్యం కూడా గతంలో ఎప్పుడూ.. లేని స్థాయిలో అమెరికాతో సంయుక్త విన్యాసాలు చేపడుతోందని తెలిపారు. గత ఐదేళ్లలో ట్రంప్ లో ఏనిమిది సార్లు సమావేశం అయినట్లు మోదీ తెలిపారు.

అనంతరం మాట్లాడిన ట్రంప్ భారత్ - అమెరికాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. భారత్ పర్యటించిన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ పర్యటన నాకు ఎంతో ప్రత్యేకమైంది. రెండు దేశాలకు ఇది ఫలవంతమైన ఉంటుంది. ఇరుదేశాల ప్రజలకు ఇస్లాం తీవ్రవాదం నుంచి భద్రత కల్పించే అంశంపై చర్చించాంమని అన్నారు. 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌పై చర్చలు జరిగాయని, అలాగే ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా ఉండాలని నిర్ణయించినట్లు ట్రంప్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories