బెంగుళూరులో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌

బెంగుళూరులో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌
x
Highlights

బెంగుళూరులో రేపు(ఆదివారం) సంపూర్ణ లాక్‌డౌన్ ని విధిస్తున్నట్టు బెంగుళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ బీహెచ్ అనిల్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

బెంగుళూరులో రేపు(ఆదివారం) సంపూర్ణ లాక్‌డౌన్ ని విధిస్తున్నట్టు బెంగుళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ బీహెచ్ అనిల్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఒక్కరోజు లాక్‌డౌన్ 1.0లో ఉన్న ఆంక్షలే వ‌ర్తిస్తాయని అయన వెల్లడించారు. ప్రజలు ఇంటివద్దనే ఉండి ప్రభుత్వాలకి సహకారం అందించాలని వెల్లడించారు. కర్ణాటక సీఎం య‌డ్యూర‌ప్ప ఆదేశాల మేర‌కే ఈ లాక్‌డౌన్ విధించిన‌ట్లు చెప్పుకొచ్చారు. వ‌లం మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఉంటే త‌ప్ప ఎటువంటి వాహ‌నాల‌కు అనుమ‌తి ఉండ‌దని స్పష్టం చేశారు.

ఇక కర్ణాటాకలో కరోనా కేసుల విషయానికి వస్తే అక్కడ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ 138 కొత్త కేసులు నమోదు కావడం విశేషం.. దీనితో తాజా కేసులతో కలిపి కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య 1,743కు చేరింది. దీనికి సంబంధించిన వివరాలను అక్కడి వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఇక అటు 26 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం రాష్ట్రములో కరోనాతో పోరాడి 41 మంది మరణించారు. ఇప్పటివరకు 597 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ,1,104 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో య‌డ్యూర‌ప్ప ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు కర్ణాటకకు రావాలంటే ఏడు రోజులు క్వారంటైన్ లో ఉండాలని సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories