కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు

కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు
x
karnataka
Highlights

కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాషాయ పార్టీ విజయ ఢంకా మోగించింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఈ ఉపఎన్నికల్లో 12 స్థానాలను కైవసం చేసుకుని పాలనను సుస్థిరం చేసుకుంది

కర్ణాటక అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాషాయ పార్టీ విజయ ఢంకా మోగించింది. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఈ ఉపఎన్నికల్లో 12 స్థానాలను కైవసం చేసుకుని పాలనను సుస్థిరం చేసుకుంది. ఫలితాల అనంతం కర్ణటక సీఎం యడియూరప్ప స్పందించారు. ఉపఎన్నికల్లో ప్రజలు తమకు తీర్పు అనుకూలంగా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మరో స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో ముందంజలో ఉంటే కుమారస్వామి పార్టీ చతికిల పడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.

ఈ ఫలితాలతో కాంగ్రెస్ లో మరింత కాక పెంచింది. ఫలితాలను పూర్తి నైతిక బాద్యత తీసుకొని సీఎల్పీ పదవికి మాజీ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావించాలి. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ కూటమి కూలిపోయి యాడ్యురప్ప సర్కార్ అధికారం చేపట్టింది. అయితే అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అంతే కాకుండా 2023 ఎన్నికల వరకూ పోటీ చేయడానికి అనర్హులని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత సమజసమే అంటూ సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎన్నికలు ఎప్పుడ వచ్చిన తిరిగి పోటీ చేయవచ్చునని తీర్పు వెల్లడించింది.

సుప్రీం తీర్పు అనంతరమే ఎమ్మెల్యేలు సీఎం యాడ్యురప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఉపఎన్నికలు ఈ నెల 5 న నిర్వహించారు. అయితే రెండు నియోజవర్గాలు న్యాయ పరమైన కేసులు ఉండడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 15 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీస్ వేరు వేరుగా పోటీ చేశాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌

ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ సంస్థలు అంచన వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. మొత్తం 15 స్థానాల్లో బీజేపీ 8-10, కాంగ్రెస్‌ 3-5, జేడీఎస్‌ 1-2, గెలిచే అవకాశం ఉందని కన్నడ పబ్లిక్‌ టీవీ తెలిపింది. బీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం బీజేపీ 9, కాంగ్రెస్‌ ,జేడీఎస్‌ చెరి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. పవర్‌ టీవీ బీజేపీ 8-12, కాంగ్రెస్‌కు 3-6 స్థానాలు జీడీఎస్ 1 సీటు గెలిచే అవకాశం ఉందని తెలిపిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories