Chennai: భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్న చెన్నై నగరం

CM Stalin Visited the Floods Impacted Areas in Chennai
x

వరద ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

Highlights

Chennai: జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు

Chennai: గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై చిగురుటాకులా వణుకుతోంది. జన జీవనం అస్తవ్యస్థమైంది. ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునగగా.. కొన్ని కాలనీలు అంథకారంలో మగ్గుతున్నాయి. మరికొన్నిచోట్ల వరద ప్రవాహంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ముంపు బాధితులను బోట్ల ద్వరా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు

చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్‌ పర్యటించారు. నగరంలోని తాంబరం ముడిచ్చూరు, వరదరాజపురం తదితర ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వాననీటి తొలగింపు పనులను సమీక్షించారు. ప్రభుత్వ ప్రత్యేక శిబిరాల్లో బసచేస్తున్న బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత రెండు రోజులుగా స్టాలిన్‌ తేనాంపేట, టి.నగర్‌, తిరువళ్లూరు జిల్లా ఆవడి, తిరుముల్లైవాయల్‌, తిరువేర్కాడు, పూందమల్లిలో వర్షబాధిత ప్రాంతాలను సందర్శించారు. పీటీసీ కాలనీ, జననివాస ప్రాంతాల్లో మోకాలిలోతు వర్షపునీటిలో నడచుకుంటూ వెళ్ళి బాధితులను పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories