ఎంత ఏడ్చినా చచ్చినోళ్ళు వస్తారా? కరోనా మరణాలపై సీఎం సంచలన వ్యాఖ్యలు

Coronavirus: CM Manohar Lal Commented That We Cannot Bring Back Those Who Died With Coronavirus by Crying
x

హర్యానా ముఖ్యమంత్రి  మోహన్ లాల్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: కరోనాతో చనిపోయిన వారిని మనం ఎంతగా వెక్కి వెక్కి ఏడ్చిన తిరిగి తీసుకురాలేమని వ్యాఖ్యానించారు

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా.. కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనాతో చనిపోతున్న వారితో స్మశానాలు నిండిపోతున్నాయి. అంత్యక్రియల కోసం క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే హర్యానాలో కరోనా వైరస్ ఉదృతి పెరిగిపోతుంది. ఇప్పటికే 4,31,981 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 3,842 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79, 466 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కరోనాతో ఎంతమంది చనిపోతున్నారనే అంశంపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఎంత మంది మరణించారో అనవసరం అన్నారు. కరోనాతో చనిపోయిన వారిని మనం ఎంతగా వెక్కి వెక్కి ఏడ్చిన తిరిగి తీసుకురాలేమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యాలను ఏ రకంగా కాపాడాలని, వారికి ఏ రకంగా ఊరట కలిగించాలనే అంశంపైనే దృష్టి పెట్టాలని సీఎం కట్టర్ వ్యాఖ్యానించారు. ప్రజలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ కోటాను 240 మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ జంషెడ్‌పూర్ నుంచి వస్తోందని అన్నారు. ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లు ఉన్న హిసర్, పానిపట్ సమీపంలో 500 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కట్టర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories