CM KCR: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన సక్సెస్

CM KCR Mumbai Tour Success
x

CM KCR: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన సక్సెస్

Highlights

CM KCR: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మాజీ సీఎం శరద్ పవార్ తో విడివిగా భేటీ.

CM KCR: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన యావత్తూ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ముంబైలో మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తో విడివిగా భేటీ అయ్యారాయన. తాము ఏం మాట్లాడుకున్నది, తదుపరి ఏం చేయబోయేది నేతలు బాహాటంగా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన కేసీఆర్ బృందం వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఎం ఠాక్రే ఇంటికెళ్లి లంచ్ తర్వాత రాజకీయ చర్చలు చేశారు.

దేశంలో జరుగుతున్న రాజకీయ ప‌రిణామాల‌పై రావాల్సిన మార్పుల‌పై చ‌ర్చించామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏక‌తాటిపైకి రావాల్సిన స‌మ‌యం ఇదేనని, దేశానికి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక అవ‌స‌రమని తెలిపారు. హైద‌రాబాద్ రావాల‌ని ఉద్ధ‌వ్ ఠాక్రేను కోరానని, ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామని కేసీఆర్ తెలిపారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే అన్నారు. దేశ హితం కోసం కేసీఆర్ తో కలిసి నడుస్తామన్నారు. పలు అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు థాక్రే. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.

మహారాష్ట్ర సీఎం తో సమావేశం ముగిసిన అనంతరం NCP జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. శరద్ పవార్ తో సీఎం కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలు, దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భారత రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న నేతగా శరద్ పవార్ ను సీఎం కేసీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటులో పవార్ ఇచ్చిన మద్ధతును మరువలేమన్నారు. దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందని అదే స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని పవార్ అన్నారు.మొత్తానికి దేశ రాజకీయాల్లో, అభివృద్ధిలో గుణాత్మకమైన మార్పు కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories