సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భేటీ

KCR-Akhilesh: *జాతీయ స్థాయిలో పనిచేసే అంశంపై చర్చ *దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా తయారీపై చర్చ

Sriveni Erugu
Updated on: 21 May 2022 3:15 PM IST
CM KCR Meets Samajwadi Party Chief Akhilesh Yadav In Delhi
X

సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భేటీ 

KCR-Akhilesh: దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇరువురు నేతలు దేశంలోని తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. జాతీయ స్థాయిలో పనిచేసే అంశంపైనా ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా తయారీపై ఇరువురు చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ అవసరం గురించి కూడా కేసీఆర్, అఖిలేష్ యాదవ్ చర్చిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story