భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ఈరోజు తొలి రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

Siramdasu Nagarjuna
Published on: 26 Dec 2025 12:52 PM IST
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
X

భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుపతి: తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ఈరోజు తొలి రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తిరుపతిలో మూడు రోజుల పాటు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ జరగుతుంది.

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి జ్యోతి ప్రజల్వన చేసి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘‘సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు. మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక. ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లింది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పింది. 2,900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించాం.ఇవాళ యోగాను 150 దేశాలు సాధన చేస్తున్నాయి.’’ అని చెప్పారు.

2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది. పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనది. 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది. సున్నాను భారతీయులే కనుగొన్నారు. మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే. వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతం. అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు. వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story