హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరు మృతి, 20 మంది గల్లంతు.. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరు మృతి, 20 మంది గల్లంతు.. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
x

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్.. ఇద్దరు మృతి, 20 మంది గల్లంతు.. అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

Highlights

Cloudburst: హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ ఆందోళన కలిగించింది. వర్షాలు, భారీ వర్షాలకంటే ప్రమాదకరమైనది క్లౌడ్ బరస్ట్ ఒక్కసారిగా హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించింది.

Cloudburst: హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ ఆందోళన కలిగించింది. వర్షాలు, భారీ వర్షాలకంటే ప్రమాదకరమైనది క్లౌడ్ బరస్ట్ ఒక్కసారిగా హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 20 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, సిమ్లా,మండి రాష్ట్రాల్లో ఒక్కసారిగా కుంభవృష్టి సంభవించింది. ఆకస్మిక వర్షాల కారణంగా వరదలు ఒక్కసారిగా పొంగిపొర్లాయి. దీంతో జనజీవనం ఎక్కడక్కడ స్తంభించిపోయింది. ముఖ్యంగా కులి జిల్లా సైంజ్ వ్యాలీలోని సియుండ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో ఒక ప్రయివేట్ పవర్ ప్రాజెక్ట్‌కు చెందిన షెడ్‌లు, ఎమర్జన్సీ రెస్పాన్స్‌ వాహనం ధ్వసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మంది కనిపించకుండా పోయారు. వీరికోసం రెస్య్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ వరదల్లో ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా చిక్కుకుపోయినట్లు సమాచారం.

హిమాచల్ ప్రదేశ్‌లో తరచూ ఈ క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపుగా ఏడు నుంచి 10 వరకు క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 2024లో వానాకాలం సీజన్‌లో ఇక్కడ దాదాపుగా 27 క్లౌడ్ బరస్ట్‌లు వచ్చాయి. ఈ సంఘటనల్లో 59 మంది చనిపోయారు. వందల ఇళ్లు, వంతెనలు, రోడ్డు ధ్వంసమయ్యాయి.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి?

భారత వాతావరణ శాఖ ప్రకారం సాధారణంగా అతి స్వల్ప సమయంలో అతి భారీ వర్షాలకు దారితీయడాన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఇందులో 20 నుంచి 30 చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఊహించని స్థాయిలో కురిసిన ఈ భారీ వర్షాల వల్ల ఆకస్మిక వరదలు ముంచుకొస్తాయి. ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి. ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలలో క్లౌడ్ బరస్ట్‌లు సంభవించే అవకాశాలు ఉంటాయి. గత కొంతకాలంగా హిమాలయ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది మిస్సింగ్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories